Hello Hello Laila
Neha BhasinNikhil Dsouza
Hello Hello Laila 歌詞
Oh! Hello Hello Hello లైలా
మాయమైంది నా మనస్సు నీవల్ల
ఏమైందో ఎక్కడున్నాదో
కళ్లముందే దాగి ఉందో పగటిపూట తారలా
Hello Hello Hello చాలా
చేసినావు చాలులేరా గోపాలా
నాలోనే దాచిపెట్టేసి
ఏమి తెలియనట్టు నాటకాలు ఆడమాకలా
ఐతే నా మనసు నిన్ను చేరినట్టు నీకు కూడ తెలిసినట్టే
ఐనా ఆ ముందు అడుగు వెయ్యకుండ ఆపుతావు అదేమిటే
పెదాలతో ముడెయ్యనా
ప్రతిక్షణం అదే పనా
~ సంగీతం ~
ముద్దుదాక వెళ్లనిచ్చి హద్దు దాటనీయవేంటి
కావాలమ్మ కౌగిలి
కౌగిలి చెలి చెలి
కొద్దిపాటి కౌగిలిస్తే కొత్తదేదో కోరుకుంటూ
చేస్తావేమో అల్లరి
అల్లరి మరి మరి మరి
అమ్మో నా లోపలున్నదంత అచ్చు గుద్దినట్టు చెప్పినావే
అవునోయ్ నీకంతకన్న గొప్ప ఆశ ఇప్పుడైతే రానే రాదోయ్
అందాలతో ఆటాడనా
అణుక్షణం అదే పనా
Hello Hello Hello లైలా
మాయమైంది నా మనస్సు నీవల్ల
ఏమైందో ఎక్కడున్నాదో
కళ్లముందే దాగి ఉందో పగటిపూట తారలా
~ సంగీతం ~
ఒక్కసారి చాలలేదు, మక్కువంత తీరలేదు
ఇంకోసారి అన్నది
అన్నది మది మది మది
ఒడ్డుదాకే హద్దు నీకు లోతుకొచ్చి వేడుకోకు
నీదే పూచీ నీదిలే
నీదిలే భలే భలే భలే
ఆ మాత్రం సాగనిస్తే చాలునమ్మ సాగరాన్ని చుట్టిరానా
నీ ఆత్రం తీరిపోవు వేళదాక తీరమైనా చూపిస్తానా
సుఖాలలో ముంచెయ్యనా
క్షణక్షణం అదే పనా
Hello Hello Hello లైలా
మాయమైంది నా మనస్సు నీవల్ల
ఏమైందో ఎక్కడున్నాదో
కళ్లముందే దాగి ఉందో పగటిపూట తారలా