Ghal Ghal 歌詞

ఘల్ ఘల్… ఘల్ ఘల్ ఘలం ఘలం ఘల్ ఘల్...
ఘల్ ఘల్… ఘల్ ఘల్ ఘలం ఘలం ఘల్ ఘల్...
ఆకాశం తాకేలా వడగాలై ఈ నేల అందించే ఆహ్వానం ప్రేమంటే
ఆరాటం తీరేలా బదులిచ్చేగగనం లా పిలిపించే తడిగానం ప్రేమంటే
అణువణువును మీటె మమతల మౌనం పదపదమంటే నిలువదు ప్రాణం
ఆపరుగే ప్రణయానికి శ్రీకారం దాహంలో మునిగిన చివురుకు
చల్లని తన చెయ్యందించి స్నేహంతో మొలకెత్తించే చినుకే ప్రేమంటే
మేఘంలో నిద్దుర పోయిన రంగులు అన్నీ రప్పించి మాగాణి
ముంగిట పెట్టే ముగ్గే ప్రేమంటే ||ఘల్ ఘల్……ఘల్ ఘల్||
చరణం 1
ప్రాణం ఎపుడు మొదలైందో తెలుపగల తేదీ ఏదో
గుర్తించేందుకు వీలుందా ప్రణయం ఎవరి హృదయంలో
ఎపుడు ఉదయిస్తుందో గమనించే సమయం ఉంటుందా
ప్రేమంటే ఏమంటే చెప్పేసె మాటుంటే ఆ మాటకి తెలిసేనా
ప్రేమంటే అది చరితను సైతం చదవనివైనం కవితను సైతం
పలకని భావం సరిగమ లెరుగని మధురిమ ప్రేమంటె
దరిదాటి ఉరకలు వేసె ఏ నదికైనా తెలిసిందా తనలో
ఈ ఒరవడి పెంచిన తొలి చినదేదంటే చిరిపైరై ఎగిరే
వరకు చేనుకు మాత్రం తెలిసిందా తనలో కనిపించే కళలకు
తొలి పిలుపేదంటే ||ఘల్ ఘల్ ……. ఘల్ ఘల్||
చరణం: 2
మండే కొలిమినడగందే తెలియదే మన్నుకాదు
ఇది స్వర్ణమంటు చూపాలంటే పండే పొలము చెబుతుందే
పదునుగా నాటే నాగలి పోటే చేసిన మేలంటే తనువంతా
విరబూసే గాయాలే వరమాలై దరిజేరె ప్రియురాలే గెలుపంటె
తను కొలువై ఉండే విలువే ఉంటే అలాంటి మనసుకు
తనంత తానే అడగక దొరికే వరమే వలపంటే
జన్మంతా నీ అడుగుల్లో అడుగులు కలిపే జతవుంటే
నడకల్లో తడబాటైనా నాట్యం అయిపోదా
రేయంతా నీ తలపులతో ఎర్రబడే కన్నులు ఉంటే ఆ కాంతె
నువ్వెతికే సంక్రాంతై ఎదురవదా ||ఘల్ ….ఘల్ ఘల్||

分享連結
複製成功,快去分享吧
  1. Chandrullo Unde
  2. Padam Kadalanantunda
  3. Ghal Ghal
  4. Something Something
  5. Adi read i Re
  6. nil UVA DHA muni怒
  7. Paripoke Pitte
S. P. Balasubrahmanyam所有歌曲
  1. Ee Preethigagi (From "Hatavadi")
  2. Kattilum Mettilum
  3. Mun Paniyaa
  4. Azhakooril (From "Thirumalai")
  5. Ithu Oru Ponmalai (From "Nizhalgal")
  6. Manakkum Sandhanamae (From " Dharma")
  7. Mujhe Mohabbat Si (From "Mohabbat Ho Gayee")
  8. Sihimuthu Sihimuthu (From "Bangarada Kalasha")
  9. Cheluvamma Chendavamma (From "Chora Chitta Chora")
  10. Kumthalakadi
S. P. Balasubrahmanyam所有歌曲

S. P. Balasubrahmanyam熱門專輯

S. P. Balasubrahmanyam更多專輯
  1. S. P. Balasubrahmanyam Bangaru Chilaka (Original Motion Picture Soundtrack)
    Bangaru Chilaka (Original Motion Picture Soundtrack)
  2. S. P. Balasubrahmanyam Chinnodu Peddodu (Original Motion Picture Soundtrack)
    Chinnodu Peddodu (Original Motion Picture Soundtrack)
  3. S. P. Balasubrahmanyam S. P. Balasubrahmanyam Mass Solo Hits
    S. P. Balasubrahmanyam Mass Solo Hits
  4. S. P. Balasubrahmanyam Deevinchumo Deva
    Deevinchumo Deva
  5. S. P. Balasubrahmanyam Arulmigu Vanabadrakaliamman Thirunamam
    Arulmigu Vanabadrakaliamman Thirunamam
  6. S. P. Balasubrahmanyam Mayuri Telugu
    Mayuri Telugu
  7. S. P. Balasubrahmanyam Thandavanaado Shiva Manjunatha
    Thandavanaado Shiva Manjunatha
  8. S. P. Balasubrahmanyam Shivastuti
    Shivastuti